Listen My Heart
Tuesday, 29 March 2011
ప్రేమ & పెళ్లి
" ప్రేమ ఒక ఆట ఎంతో మధురంగా వుంటుంది
పెళ్లి ఒక తుపాకి తూటా
అమ్మో...
గుండె చీల్చి చంపుతుంది ....!"
ఆనంద గీతం
" జీవితం ఒక చంద్ర బింబం
అది కురిపించే వెన్నెల కిరణాలే సుఖ సంతోషాలు
కష్టాల కారు మబ్బులు ఎన్ని కలసినా
ప్రకాశిస్తున్న చంద్రోదయాన్ని ఆపలేవు ...!"
Marriage
" ఏడు అడుగులు , వేద మంత్రాల సాక్షిగా
గుప్పెట అక్షింతలు , గుండె తాకు దీవెనల మధ్య
రెండు మనసులు కలసిన తరుణం
మధురం సుమా వందేళ్ళ ఈ జీవితం ....!"
Come on warm up yourself
" కలలు కంటూ కూర్చుంటే కలత తీరిపోదు
నిదుర మరచి నిలుచుంటే నిన్న తిరిగిరాదు
చరిత పుటలు తిప్పి చూడు
కష్టం లేకుండా సాధించినది ఏదీ లేదు .....!"
You are something special
" మాటల్లో చిలిపితనం
చూపుల్లో స్నేహగుణం
చిరునవ్వులో ఓదార్పుదనం
కలగలిపి నీవుగా మరే నేస్తం...
ఓ మధుర క్షణం ....!"
Reply please
"
నీపై మనసు పడి
చెప్పలేక నీ ఎదుటపడి
మరునిముషం మదనపడి
మౌనం గా నా కళ్ళతోనే మాట కలుపుతున్నాను
బదులు పలుకవూ ?
నీవు కనిపిస్తే చాలు స్పందించే నా గుండెకు
నీవు ఏమౌతావని అడగాలని
ఆత్రంగా దరిచేరుతున్నాను
ఆతిద్యమివ్వవూ ? ...!"
Love
" చిరు చూపులతోనే
హృదయ వీణను
మీటినపుడు వెలువడే
మౌన రాగమే ప్రేమ ....!"
Monday, 28 March 2011
Love song
" చెలీ...!!!"
సౌమ్య మైన నీ పేరు తెలుసు
అందమైన నీ రూపు రేఖలు తెలుసు
నిన్ను దేవతలా ఆరాదించడమూ తెలుసు
కాని నా మనసుకు తెలియనిది ఒకటే
నీ ఎదుట పడి దైర్యంగా నా ప్రేమను తెలుపడం
అందుకే,
మౌనం గా తనలోనే ఆలపించే ఓ ప్రేమ గీతం ....! "
You and Me
"నువ్వు వేరు నేను వేరు
ప్రాణం ఒకటే గుండె తోడు
నిన్న లేదు రేపు లేదు
ప్రేమ ఒకటే నాకు తోడు
బాధ నీ గుండెలో నీళ్ళు నా కళ్ళలో
నవ్వు నీ మోములో నువ్వు నా ఊహలో
ఒకరికి ఒకరై ఇద్దరం ఒకరై
ఓ తియ్యని కబురై వినుపించుమా
నా ప్రాణమా ....!"
Newer Posts
Home
Subscribe to:
Posts (Atom)