Sunday, 31 May 2015

ఆడపిల్లలు

"నేలతల్లి ఒడిలో నవ్వుతూ విరబూసిన
సుకుమారమైన గడ్డిపూలు ఆడపిల్లలు ...!
అందమైన ప్రకృతిలో తుమ్మెదలు ఝుమ్మంటూ 
ఆలపించే అమృత గీతాలు ఆడపిల్లలు ...!
సౌమ్యంలో చంద్రుని , ఔదార్యంలో భూదేవిని మించి,
నీలి నింగిలో తారాడే నవ తారకలు ఆడపిల్లలు ...!
కడలివాకిట ఎగిసే కెరటాలు 
కనుల ముంగిట మెరిసే రత్నాలు 
మనుసును రంజింప చేసే మధుర కావ్యాలు ఆడపిల్లలు ...!
కంటిపాపల్లాంటి ఆ ఆడపిల్లలు ,
ఒక్క కన్నీటి బొట్టు నేల రాల్చితే 
ధరణి గుండెల్లో ఇంకిపోయిన ఆ కన్నీటి చుక్కే 
మహా ప్రళయమై పైకి లేస్తుంది ...!!!"

శ్రీ సాయి దాస్ 
(సూర్య చవాకుల)

Friday, 29 May 2015

శభాస్ ... చంద్రబోస్ ....!!!

          "సుభాష్ చంద్రబోస్ ... భరతమాత గుండె చప్పుడు"


                                             
ఒకే ఒక్కడు ...!
కుటిల రాజకీయాలకు అతీతుడు ...రణరంగానికి అతి సన్నిహితుడు 
భరతమాతకు ముద్దు బిడ్డడు .... యువతకు  ఆదర్శవంతుడు 
అతని మాటకు పదునెక్కువ ... అతని బాటకు గరుకెక్కువ...! 
మాటల్లో ... చేతల్లో అంకిత భావం 
అజాద్ హింద్ పౌజ్  అతని ఆయుధం ...!
క్రమశిక్షణలో ఎదురులేని మనిషి 
న్యాయకత్వంలో తిరుగులేని మహర్షి ...!
సింగపూర్ , జపాన్ ,జర్మనీ 
ప్రాంతమేదైనా ... అదే గుండె నిబ్బరం
హిట్లర్ తో సైతం బేటి ఐన గుండె ధైర్యం...!
స్వాతంత్యం కోసం సంద్రాలను సైతం దాటి ,
భరత జాతిని ఒక్కటి చేసిన  వజ్రసంకల్పం 

'దేశ భక్తుల్లోకెల్ల గొప్ప భక్తుడు' అని 
గాంధీ చే కొనియాడబడిన వాడు ...!

అంతర్గత స్పర్ధలు మరచి గాంధీని సైతం  ''జాతిపిత" అని పిలువగల 
ఉన్నతమైన మనసున్న వాడు ...!

అందుకే ... అతడు అమరుడు ....!
దేశభక్తుల్లో అగ్రగణ్యుడు ...!!!

శ్రీ సాయి దాస్ 
(సూర్య చవాకుల)
  



Thursday, 28 May 2015

నీ తలపుల లోగిలి లో ...ఒక్క సారి ...!!!

"ప్రియతమా !
ఒక్క సారి నీ తలపుల లోగిలిలో విహరించ నీయవూ ...?
నీ కనుల వాగులలో జలకమాడి ,
చక్కని నీ చెక్కిలితో సరసమాడి ,
మధురమైన నీ అదరాల పై కమ్మని అనుభూతులను
చిత్రించు కుంటాను ...!
చిరుగాలికే రెపరెపలాడే ,
నీ కురుల చప్పుళ్ళలో స్వచ్ఛమైన సంగీతాన్ని 
ఆలకిస్తాను ...!
ఒక్క క్షణం ... కమ్మనైన నీ పలుకులలో ఒదిగి,
నన్ను నేను ఆప్యాయంగా పలుకరించుకుంటాను ...!

ఒక్కసారి నీ చిరునవ్వుల పరిమళంలో నేను ఒలిగిపోయి ,
ఈ ప్రకృతి అంతా వ్యాపించి గుభాలించిపోతాను ...!
అందుకే ,
ప్రియతమా ఒక్కసారి నీ తలపుల లోగిలిలో విహరించ నీయవూ ...???

శ్రీ సాయి దాస్ 
(సూర్య చవాకుల )

Wednesday, 27 May 2015

స్నేహం ... ఒక అద్భుతం ...!!!

" అందమైన అక్షరాలను చూడగలం 
కాని , మధురమైన భావాలను కనలేo ...!
ఇష్టమైన నేస్తాన్ని తాకగలం 
కానీ, తీయనైన స్నేహాన్ని స్ప్రిశించాలేం ...!

భగవంతుడు ఈ సృష్టిలో కొన్ని అధ్బుతాలకు మాత్రమే 

రూపాన్ని ఇచ్చాడు.
 ఎందుకంటే ,
రూపమున్న ప్రతీదీ నశిస్తుంది కాబట్టి ...!
కానీ, ప్రత్యేకమైన స్నేహానికి మాత్రం ఆకారాన్ని ఇవ్వలేదు 
అందరి గుండెల్లో శాశ్వత మై నిలవాలని కాబోలు ...!!!"

చిలిపి ఆలోచన ...!!!

" ఒకోసారి... నన్ను చూసి నేను జాలి పడతాను 
ఎందుకంటే ...
నాకు నిన్ను ప్రేమించడం వచ్చు 
కాని , నీ ప్రేమను పొందడం రాలేదని ...!
మరోక్షణం...  నిన్ను చూసి జాలిపడతాను 
ఎందుకంటే ...
మరి నీకు నాప్రేమను పొందడం తెలుసు 
కాని , నన్ను ప్రేమించడం రాదుగా...!!!"

నీతోనే ...!!!


"నీ తోనే వెన్నలొచ్చే...
 నీతోనే వేకువొచ్చే 
నీవెంటే ప్రాణమొచ్చే ...
 నీ వెంటే గానమొచ్చే 
చెలీ ....
 నీవు రాక , నాకు  దుఖమొచ్చే ...!!!"

త్యాగం & స్వార్ధం ...!!!

"అందంగా , అమాయకంగా 
విరిసిన పూవుది త్యాగం ...!
ఆ అందాన్ని , 
తన అందంకోసం , ఆకర్షణ కోసం 
త్రుంచిన స్త్రీది కొంత  స్వార్ధం ...!!!"

సిగ్గు ... ఆ క్షణం ...!!!


సిగ్గు ... ఆ క్షణం 
" చిరుగాలికి ఆమె పైట చెదిరితే ఆ దృశ్యం 
ఈ ప్రకృతి తాను  స్రిష్టించిన అందాన్ని తనివి తీరా వీక్షించడానికి 
పిల్ల తెమ్మెరను పంపి ఆమె పైట చెంగును 
తొలగించినట్లు ఉంటుంది ...!!!"

ఓ ప్రియతమా ....!!!


ఓ ప్రియతమా ...!
కనులు చూడగలవు శూన్యం వరకు 
చెవులు వినగాలవు నిశబ్ద్రం వరకు 
ఈ రెండిటిని సమన్వయ పరచేది మనసైతే,
నీవు ఆ మనసులో పదిలమై 
దివ్యంగా నా కనులకు  కనిపించి 
మధురంగా నా చెవులకు వినిపించి 
మరుజన్మ వరకూ నను మురిపించవూ ...!!!

ప్రేమ ???

"ప్రేమ ఫలిస్తే పరిమళించే పుష్పం 
లేకుంటే ...
అదే ప్రేమ జ్వలించే కాష్టం ...!!!"

Monday, 25 May 2015

సందేశం ...!!!

             హ్యాపీ న్యూ ఇయర్ 

" చిత్రించుకో నీ జీవితాన్ని హృదయమనే రంగుల సౌధంలో 
అందంగా , అద్బుతంగా ...!
లిఖించుకో నీ ఆశయాలను నీ మనోఫలకంపై 
అక్షర సుమాలుగా,
ఫలించి, పరిమళించే మధుర స్వప్నాలుగా ...!
పాత సూర్యుడే అయినా ... పాత వెలుగే అయినా,
నేటి ఉషోదయంలో కొత్తదనముంది చూడు 
నీ జీవిత గమనానికి రధ సారధి నీవే 
నేడే నీవు కోరుకున్న వెలుగు వైపు పయనం సాగించు ....!!!

సాగిపోనీ ... నీ జీవన కవిత ...!!!


సాగిపోనీ నీ జీవన కవిత ...!!!
ఆనందపు శిఖరాలను అందుకుంటూ 
విషాదాల సంద్రాల్లో ఈదుకుంటూ ....

వినీల ఆకాశం గుండా 
కలనైనా వెనుచూడకుండా
సాగిపోనీ నీ జీవన కవిత ...!!!


ప్రకృతి కాంత లాలనలో 
సుప్రభాతపు నీడలో 
సేదతీరుతూ ... సెలయేరై పారుతూ 
సాగిపోనీ నీ జీవన కవిత ...!!!

చీకటి కుహరాలను చీల్చుకుంటూ 
చీకు చింతల సైన్యాన్ని గెల్చుకుంటూ 

అనుభవాల రహదారుల్లోంచి 
పెనుభయాల  పరదాల్లోంచి 
అడుగు బయటకు పెట్టి 
విజయం వైపు విల్లు ఎక్కుపెట్టి 
సాగిపోనీ నీ జీవన కవిత ...!!!


శ్రీ సాయి దాస్ 
( సూర్య చవాకుల )

ఒక చిన్ని కోరిక ...!!!


       ఓ చిన్ని కోరిక 

" పచ్చని ప్రకృతి ఒడిలో నీవు,
నీ నులి వెచ్చని కౌగిలిలో నేను ...!
వేగం పెరిగిన గుండె చప్పుళ్ళు 
వేడి సెగల నిట్టూర్పుల మధ్య
బరువెక్కిన కనురెప్పలు వాల్చి
ఒక్క క్షణం తనువులు మరచి 
తమకంతో ఒక్కటయ్యే అ తరుణం ఒక స్వర్గం 
ఓ తరుణీ నీ కరుణ ఉంటే ...!!!"

శ్రీ సాయి దాస్ 
(సూర్య చవాకుల) 

Sunday, 24 May 2015

ఒక సారి నవ్వవూ ... ప్లీజ్ ...!!!

స్మైల్ ప్లీజ్ ...!!!

“వెన్నెల వేదికపైకి
చిరుగాలి నడచి వచ్చి ఇచ్చిన చల్లని సందేశంలా
వుంటుంది నీ చిరునవ్వు


చెలీ , నాకోసం ఒక్కసారి నవ్వవూ ?”

ఆడది ... ఒక ఆదిశక్తి ...!!!

ఆడది ఆదిశక్తి’

ఈ సృష్టిలో ఆది శక్తి ఆడది
ఎంతటి విజ్ఞానం అభివృద్ధి చెందినా
ఏ యంత్రమూ  మనిషికి జన్మనివ్వలేదు
ఒక్క స్త్రీ మూర్తి తప్ప ...
అటువంటి మగువకు జన్మను ఇవ్వడానికి ఈ సమాజం
ఎందుకు భయపడుతుంది ?
ఎవరో ఒక పండితుడు చెప్పాడు
కొడుకు పుడితే పున్నామ  నరకం తప్పుతుందని
అది ఒక  తరతరాల నమ్మకం ... !
ఎక్కడో ఒక అత్తగారు చెప్పింది  కుతురుపుడితే
అష్ట దరిద్రాలు అంటుకుంటాయని
 ఇదేమి విడ్డూరం...
మరి ఆమె ఒక ఆడదేనని మరచిపాయిందేమో!
 విజ్ఞానం మనిషి ఉన్నతికి ఉపయోగపడాలి
మరి అదే విజ్ఞానం  మూఢ నమ్మకానికి తోడై
స్కానింగ్ యంత్ర రూపంలో  పుట్టే ఆడ శిశువులను
ముందే  కనిపెట్టి చంపేస్తుంటే
మానవత్వం విలువ రూపాయి నోటు ముందు ఏ పాటిదని చెప్పాలి.
పొద్దు పొడిస్తే ధనలక్ష్మి చిత్ర పటాన్ని
ఒక్క క్షణం వీడని ఒక వ్యాపారి
తన ఇంట జన్మించబోయే మరో స్త్రీ లక్ష్మిని తిరస్కరిస్తాడెందుకో ?
ఇదే పోకడ గత చరిత్రలో ఉండి వుంటే...
ఒక ‘ఇందిర’ ఏవత్ భారతాన్ని పాలించి ఉండేదా ?
ఒక ‘కల్పన’ విశ్వ వీధులలో పయనించి విశ్వ కీర్తిని మనకు మిగిల్చేదా ?
విశ్వ మాత ‘మదర్ థెరీసా’ సేవామృతం ఈ మానవాళికి దక్కేదా ?
ఒక తల్లిగా , భార్యగా , కూతురుగా తన జీవితాన్ని  త్యాగం చేయడంలో
స్త్రీ మూర్తికి సాటి ఎవరు నిలువగలరు ?
కష్టాల కోసమేనా పాపం మగువ జీవితం ?
కన్నీటి కోసమేనా మరి ఆమె జననం ?
ఒకప్పుడు బాల్య వివాహాలు , సతీ సహగమనాలు ,
 పరదా ఆచారాలు ఆమె పాలిట ఉక్కు సంకెళ్ళు
నేడు జన్మించే హక్కే కరువై
మాత్రు గర్భమే సమాధిగా చేసుకున్న ఆమెకు న్యాయం చేసేది ఎవరు ?
అన్నింటా పురుషునితో పోటీ పడగల శక్తి
ఈ ధరణి పై జన్మించి జీవించే హక్కు ,
నిండు జగతిలో మాత్రు సుమమై పరిమళించే శక్తి
ఆ స్త్రిమూర్తికి గాక ఎవరికి  ఉంటాయి  ...!!!

శ్రీ సాయి దాస్ 
(సూర్య చవాకుల) 


Thursday, 21 May 2015