Monday, 25 May 2015

సాగిపోనీ ... నీ జీవన కవిత ...!!!


సాగిపోనీ నీ జీవన కవిత ...!!!
ఆనందపు శిఖరాలను అందుకుంటూ 
విషాదాల సంద్రాల్లో ఈదుకుంటూ ....

వినీల ఆకాశం గుండా 
కలనైనా వెనుచూడకుండా
సాగిపోనీ నీ జీవన కవిత ...!!!


ప్రకృతి కాంత లాలనలో 
సుప్రభాతపు నీడలో 
సేదతీరుతూ ... సెలయేరై పారుతూ 
సాగిపోనీ నీ జీవన కవిత ...!!!

చీకటి కుహరాలను చీల్చుకుంటూ 
చీకు చింతల సైన్యాన్ని గెల్చుకుంటూ 

అనుభవాల రహదారుల్లోంచి 
పెనుభయాల  పరదాల్లోంచి 
అడుగు బయటకు పెట్టి 
విజయం వైపు విల్లు ఎక్కుపెట్టి 
సాగిపోనీ నీ జీవన కవిత ...!!!


శ్రీ సాయి దాస్ 
( సూర్య చవాకుల )

No comments:

Post a Comment