కఫినీ వస్త్రం లో కనిపించే ఓ శాంతి
కపోతం
భక్తుల మదిలో నిక్షీప్తమైఉన్న ఓ
సజీవ దేహం...
ఈ అనంత సముద్ర్రాలు , ఆకాశం ,
నక్షత్రాలు
సూర్య చంద్రులు అతని ఉనికి ...
అతడే విశ్వ కర్త , సృష్టి కర్త
సమస్త ప్రపంచాన్ని భక్తీ కైవల్య
ఊయలలో
డోల లాడించే మాతృమూర్తి
ఆయనకు నటనంటే ఇష్టం , ఆటలంటే
ప్రీతి
అవే అతని భక్తి పరీక్షా సాధనాలు
ఐశ్వర్యాన్ని చిరిగిన వస్త్రాలలో
దాచుకున్న పరమయోగి ...
ప్రేమతోనే దండించగల కరుణా
సముద్రుడు
ఏ రుచీ లేని ఆహారాన్ని తానూ
భుజిస్తూ
షడ్రుచులనూ భక్తులకు ప్రసాదించగల
కరుణా మూర్తి...
తాను కటిక నేలపై పవలిస్తూభక్తులకు
పసిడి తల్పాలను అనుగ్రహించాగల దయా హృదయుడు...
బాబా అన్న ఒక్క పిలుపు చాలు...
తనతో బంధుత్వం కలుపుకోవడానికి
సాయి అన్న ఒక్క నామం చాలు... సమస్త
పాపాలనూ ఒక్కసారిగా త్యజించడానికి
ఈ ప్రకృతిలో వృక్షాలకు , పూవులకూ
ఒక వసంతం ఉన్నట్లే
మన జీవితంలోనూ వెలుగు నింపే ఒకే
తియ్యని వసంతముంది
అదే బాబా ప్రేమ ...!!!”
శ్రీ సాయి దాస్
(సూర్య చవాకుల)
No comments:
Post a Comment