Sunday, 7 June 2015

ప్రకృతి ... నా ప్రియనేస్తం ...!!!

"Nature is my lover ,
Which neglects me never...!!!"

"ప్రకృతి నా ప్రియ నేస్తం,
ప్రకృతి నా ప్రణయ సౌధం ... !
అమ్మ కడుపులోనుండి బయట పడగానే 
నన్ను ఆప్యాయంగా తన ఒడిలోకి చేర్చుకుంది 
కంటికి రెప్పలా కాపాడి నన్ను ఇంతటి వాడిని చేసింది ...!
అమ్మ కొట్టినప్పుడు ఒంటరిగా దుఖిస్తుంటే ,
చిరు గాలుల హస్తాలతో నా కన్నీటిని తుడిచి ఓదార్చింది ...!
చిన్నప్పుడు అందరూ ఒక్కటై 
నన్ను గెలిచేసినపుడు నేనున్నానంటూ 
ప్రేమగా తన అక్కున నిలుపుకుంది 
చదువురాలేదని మాష్టారు దండించినపుడు,
తనే ఒక బడిగా మారి ఎన్నో జీవిత పాఠం నేర్పింది ...!
నిరాశతో నేను దిగులుచెంది కూర్చున్నప్పుడు 
ఉషోదయాన ఆశల సూర్య కిరణాలను పంపి 
నాలో ఉత్సాహాన్ని నింపింది ...!
నేను అలసిన కన్నులతో భారంగా నిలిచినప్పుడు,
నిశీరేయిని సాగనంపి నన్ను నిద్రపుచ్చింది 
వేల పక్షుల కిలకిల రావాలను మేళవించి 
మధుర సంగీతాలుగా నాకు వినిపించి 
నా మౌనంలో వేదనను దూరం చేసింది ...!
ఎంత దూరం పయనించినా నా చెంతనే తానంటూ 
చిగురాకుల చిరులేఖలు పంపి నన్ను పలుకరిస్తుంది 
పూవులలో పరిమళమై నన్ను ఆహ్లాదపరుస్తుంది
సేలయేరులలో నీటి తుంపరలై నన్ను తాకుతుంది 
మంచు బిందువులా , జడివానలా 
నన్ను చేరి మురిపిస్తుంది ...!!!"  

శ్రీ సాయి దాస్ 
(సూర్య చవాకుల)

No comments:

Post a Comment