Saturday, 20 June 2015

ఒరిస్సా తీరం



"మేం ఊహలనే వాస్తవాలుగా చిత్రించాం కళింగ రాజ్యంలో ... ఒడిస్సా రాష్ట్రంలో మేం తిలకించిన విచిత్రాలెన్నో 
తీరం తెలియని 'చిలుక' (చిల్కా) సరస్సుసుస్వాగతం పలికింది ...!
రాతి కొండలపై  ఉదయించిన సూర్యుని ఉషస్సు ఆహ్లాదం కలిగించింది ...!
కోణార్క్ లో శిధిలమైనా , నేటికీ జీవమున్న సూర్య దేవుని ఆలయం ,
భువనేశ్వర్ లో అడుగడుగునా లింగరాజు నిలయం
 పూరీ జగన్నాధుని రధ చక్రాలపై మేం వీక్షించిన సౌందర్య దృశ్యాలు
 ఉత్తర రీతిలో నిర్మించిన ఆ ఆలయాలు గాంగరాయుల కీర్తికి 
ప్రతిరూపాలు ...!!!"


శ్రీ సాయి దాస్
(సూర్య చవాకుల) 

No comments:

Post a Comment