Thursday, 4 June 2015

సైనికుడు

"Hats off my dear soldier ,
Live long my dear brother ...!"

" తల్లిని ప్రేమించిన వాడే దేశాన్ని ప్రేమించగలడు 
దేశాన్ని ప్రేమించిన వాడు ...ఈ సృష్టిలో దేనినైనా ప్రేమించగలడు...! 
తుపాకీ గుండెతో సాన్నిహిత్యం 
తన గుండెనూ ఒక ఇనుప తూటా గా మారిస్తే, 
తనలో సెంటిమెంటు సగమవ్వక ఏమవుతుంది ...!
తన వాళ్ళ ప్రేమానుబంధాలను 
ఉత్తరాలకే పరిమితం చేసుకొని,
భారతమాత ప్రేమను ఎర్రని అక్షరాలతో లిఖించగ
తన రక్తాన్ని సిరాగా చేసుకొని ,
తన చిరునవ్వులనే సుమాలుగా 
ధాత్రి పాదాలపై విరజిమ్మే త్యాగజీవికి  ఒక వందనం సరితూగునా ...!
సృష్టిలో ప్రతిజీవికి ప్రాణం అతివిలువైనది 
అటువంటి ప్రాణాన్ని యుద్ధభూమిలో బాణంగా సందిస్తే  
తన వారసుడిగా మనం చేయగలిగింది ఏమిటి ?
సంపాదనకోసం సైనికుడు అయ్యాడనుకుంటే , 
మరి సంపాదించింది   అనుభవించక 
తన ప్రాణాన్ని ఎలా నిస్వార్ధంగా త్యాగం చేస్తాడు ...!
గుర్తు తెలియని అక్షాంశ రేఖాంశాల చావు పల్లకి పై 
తన కన్నుల టార్చిలైట్లను వెలిగించుకొని 
నిదురమరచి ఒక నిప్పుకణమై రగిలే నిండు ప్రాణానికి 
ఒక నీరాజనం ప్రతిఫలం మౌనా ...!
వేడుకవ్వగ వసంతమైనా , గ్రీష్మమైనా ఒక్కటే 
సేదతీరగ ఎడారులైనా , సెలయేరులైనా ఒక్కటే 
సహనం అతని చిరునామా ... సమత్వం అతను కొసరు ప్రేమ 
మౌనంలో సైతం గాంభీర్యం .... ముల్లబాటైనా  పూల సింహాసనం ....!!!"

శ్రీ సాయి దాస్ 
(సూర్య చవాకుల)



No comments:

Post a Comment