Sunday, 14 June 2015

ప్రత్యక్షదైవం





“నవమాసాలు మోసి నాకు జీవితాన్ని ప్రసాదించావు
నా చిట్టి పొట్టి మాటలకు మురిసిపోయావు
నేను బుడి బుడి అడుగులు వేసినపుడు పొంగిపోయావు
దుఖం లో ఓదార్పువయ్యావు
తప్పుటడుగులు వేసినా  గుండెకద్దుకున్నావు
ఓటమిలో ధైర్యాన్నిచ్చావు 
గెలుపులో వెన్నుదన్నై నిలిచావు
నన్ను కంటికి రెప్పలా కాపాడి ఇంతవాడిని చేసావు 
ఎన్ని జన్మలు ఎత్తినా నీ రుణాన్ని తీర్చుకోలేను

అందుకే అమ్మా ...!
నిన్ను నా గుండెల్లో పదిలంగా భద్రపరచుకుంటాను
ప్రత్యక్ష దైవంలా  పూజించుకుంటాను ...!!!”


                                    శ్రీ సాయి దాస్ 
                           (సూర్య చవాకుల)

No comments:

Post a Comment